NTV Telugu Site icon

TGPSC : గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

Group 1

Group 1

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను ఏప్రిల్ 16, 17, 19 మరియు 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రదర్శించింది. అభ్యర్థులు తమ పేర్లు పరిశీలించుకొని, నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి. అంతేకాకుండా,  ఏప్రిల్ 15 నుండి 22 వరకు వెబ్ ఆప్షన్స్ కు  సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని TGPSC స్పష్టం చేసింది.

Court Movie: తిరుపతిలో కోర్టు సినిమా తరహా ఘటన