TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 సంవత్సరంలో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి పోస్టుల నియామకానికి వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో ప్రకటన విడుదల చేసింది. అయితే.. విద్యుత్ శాఖలో 13,820 మంది, యాంత్రిక శాఖలో 11,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్) పోస్టుల కోసం 2023 అక్టోబర్ 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో రాత పరీక్షలు నిర్వహించబడగా, అసిస్టెంట్ ఇంజనీర్ (యాంత్రిక) పోస్టుల పరీక్షలు 2023 అక్టోబర్ 26న నిర్వహించారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
అయితే.. చర్యల్లో భాగంగా, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విద్యుత్ శాఖ కోసం గత నెల 22 నుంచి 28వరకు, యాంత్రిక శాఖ కోసం 23 , 24 , 28 తేదీల్లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేశారు అధికారులు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇతర సంబంధిత ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, కమిషన్ 50 మంది విద్యుత్ విభాగం అభ్యర్థులు, 97 మంది యాంత్రిక విభాగం అభ్యర్థులకు ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ప్రకటించింది. వివరాలకు అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.fhpsc.gov.in) ను సందర్శించండి.
HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్‌లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా