TG Vishwa Prasad About Prabhas Raja Saab: ‘రాజాసాబ్’ చిత్రంతో తాము సైలెంట్‌గా వస్తామని, పెద్ద విజయాన్ని అందుకుంటాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ చేసిన సినిమాలన్నింటి కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. రాజాసాబ్ చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోందని.. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం అని చెప్పారు. సంగీతం మరో స్థాయిలో అలరిస్తుందని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్ అన్న విషయం తెలిసిందే.
రాజాసాబ్ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. ‘మేము చాలా సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్ కొడతాం. రాజాసాబ్‌ను ప్రారంభించినప్పుడు ప్రభాస్ నటించాల్సిన పెద్ద చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోంది. ఇది చాలా పెద్ద సినిమా. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం. ఇండియాలో ఇప్పటివరకు ఇంత భారీ సెట్ ఏ సినిమాకు వేయలేదు. సినిమాలో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌లకు కూడా పెద్దపీట వేశాం. సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. ఫైట్స్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్, హారర్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ రాజాసాబ్‌లో ఉంటాయి’ అని విశ్వప్రసాద్ చెప్పారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్‌కు ఇష్టమైన సినిమా, హీరోయిన్ ఎవరంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సిద్ధమవుతోన్న చిత్రం రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రిద్ధి కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, జిషు సేన్‌గుప్తా, బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.