TG-TET 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్
  • టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
  • జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టీజీ
Tg Tet 2026

Tg Tet 2026

తెలంగాణలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీచర్ ఉద్యోగాలకు కీలకమైన టీజీ టెట్ 2026 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య తేదీలను ప్రకటిస్తూ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీజీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టీజీ టెట్ 2026 పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం (9-11.30), మధ్యాహ్నం (2-4.30) రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుని, గడువు తేదీల్లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి టెట్ కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.