TG SET 2026 Notification: టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీ వివరాలిలా..

Tg Set 1

Tg Set 1

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాలకు అర్హత కల్పించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET) 2026 ప్రకటనను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

విద్యా అర్హతలు..
సంబంధిత సబ్జెక్టుల్లో (MA, M.Sc, M.Com, MBA, MCA, M.Tech తదితర మాస్టర్స్ డిగ్రీలు) కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం..
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (CBT) ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 3 గంటల వ్యవధిలో రెండు పేపర్లు ఉంటాయి:

పేపర్-1: బోధనా, పరిశోధనా నైపుణ్యాలపై 50 ప్రశ్నలు (100 మార్కులు).

పేపర్-2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలు (200 మార్కులు).

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 3, 2026

సాధారణ రుసుముతో చివరి తేదీ: ఆగస్టు 30, 2026

ఆలస్య రుసుముతో గడువు:

రూ. 1,500తో: ఆగస్టు 31 – సెప్టెంబర్ 5

రూ. 2,000తో: సెప్టెంబర్ 6 – సెప్టెంబర్ 10

రూ. 3,000తో: సెప్టెంబర్ 11 – సెప్టెంబర్ 12

దరఖాస్తుల సవరణ (Edit Option): సెప్టెంబర్ 13 నుండి 15 వరకు

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: సెప్టెంబర్ 22, 2026 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష నిర్వహణ: సెప్టెంబర్ చివరి వారంలో ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారికి వెబ్ సైట్ https://telanganaset.org/ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పాత ప్రశ్నాపత్రాలను కూడా ఈ వెబ్ సైట్ నుంచే డౌన్ లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.