Site icon NTV Telugu

TG: టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..?

10th Exams

10th Exams

లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే.. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

* టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్:
* నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025.
* ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
* ఆలస్య రుసుముతో మే 25, 2025
* పరీక్ష తేదీ జూన్ 6, 2025
* కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
* అర్హత- మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం చేయాలనుకునే వారు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి.

Read Also: Chinnamail Anji Reddy: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌..

మరోవైపు.. టీజీ ఈసెట్ (TG ECET 2025) షెడ్యూల్ కూడా విడుదలైంది. టీజీ ఈసెట్ అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఇది తెలంగాణలో డిప్లొమా హోల్డర్లు మరియు B.Sc. (గణితం) డిగ్రీ హోల్డర్లకు B.Tech/BE, B.Pharmacy కోర్సుల రెండవ సంవత్సరంలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది.

టీజీ ఈసెట్ షెడ్యూల్:
నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 25, 2025.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 3, 2025.
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ.. ఆలస్య రుసుముతో తేదీ ఏప్రిల్ 19, 2025
పరీక్ష తేదీ: మే 12, 2025

Exit mobile version