TG EAPCET : తెలంగాణలో ముగిసిన టీజీ ఎప్‌సెట్ పరీక్షలు.. 93% పైగా హాజరు
- ప్రశాంతంగా ముగిసిని టీజీ ఎప్ సెట్
- 93% హాజరుతో విజయవంతం
- త్వరలో ప్రాథమిక కీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్‌సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు సుమారుగా 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్‌నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
జేఎన్టీయూహెచ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. కట్టా నరసింహారెడ్డి, టీజీ ఈఏపీసెట్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలాకిష్ట రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తదితరులు కీలక పాత్ర పోషించారు. పరీక్షల హాజరు వివరాలను పరిశీలిస్తే.. అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్‌లో 92% నుంచి 94% వరకు హాజరు నమోదైంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో, 93% నుంచి 94% వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ అధిక శాతం హాజరు విద్యార్థుల్లోని పోటీతత్వాన్ని, ఉన్నత విద్యపై వారికున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
ఈ పరీక్షల ప్రాథమిక కీ (Preliminary Key) త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తానికి, టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు అధిక శాతం హాజరుతో విజయవంతంగా ముగియడం విద్యార్థులకు ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ అధికారులు త్వరలోనే తదుపరి ప్రకటనలు విడుదల చేయనున్నారు.
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!