TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎన్‌జినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) దరఖాస్తు ప్రక్రియకు మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 సాయంత్రం 4:45 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్ ప్రకటించామని తెలిపారు.
తాజా షెడ్యూల్ ప్రకారం, టీజీ ఎప్ సెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 4 వరకు కొనసాగనుంది. ఈ మార్పును విద్యార్థులు గమనించి సంబంధిత తేదీల్లో తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు తెలియజేశారు.
Shivaraj Yogi : కోటి రుద్రాక్ష ప్రసాదం.. మహదేవ్ శక్తి సంస్థాన్
ఇందులో భాగంగా అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సులకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు మే 2, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పులను తప్పకుండా గమనించి, తమ పరీక్షా సిద్ధతను తగిన విధంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో ఏవైనా అదనపు మార్పులు లేదా తాజా సమాచారం వెలువడితే వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తామని పరీక్ష నిర్వాహకులు వెల్లడించారు. కాబట్టి అభ్యర్థులు తరచూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ, తమకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. టీజీ ఎప్ సెట్ 2024కు సంబంధించి ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలియజేశాయి.
Kedar Selagamsetty: షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి?