Site icon NTV Telugu

Cyber Gang Arrest: ఒక్క క్లిక్‌తో అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు..

Cyber

Cyber

అతిపెద్ద సైబర్‌ నేరగాళ్ల ముఠాను పట్టుకుంది తెలంగాణ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో…!! దేశవ్యాప్తంగా 450 కిపైగా కేసుల్లో ప్రమేయం ఉన్న 25 మంది సైబర్‌ క్రిమినల్స్‌ ఆటకట్టించారు. ఒక్క తెలంగాణలోనే 60కి పైగా సైబర్‌ నేరాలకు పాల్పడింది ఈ ముఠా. 7 రాష్ట్రాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు.. 72 లక్షల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్‌లోనే సైబర్‌ నేరాల బారిన పడిన బాధితులకు 3 కోట్ల 67 లక్షల రూపాయలను తిరిగి ఇప్పించారు పోలీసులు.

Also Read:Aa Gang Repu 3: ఆసక్తి రేపుతున్న ‘ఆ గ్యాంగ్ రేపు 3’!

ఎక్కడుంటారో.. ఎంతమంది ఉంటారో.. ఎలా చేస్తారో కూడా తెలియదు..!! కానీ కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఒక్క క్లిక్‌తో బ్యాంక్‌ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు. కొందరు ఏకంగా మన చేతుల్తోనే వాళ్ల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసేలా హిప్నటైజ్‌ చేస్తారు..! ఇలా నిత్యం పదో.. పాతికో కాదు.. ఏకంగా వందల్లో కేసులు. అత్యంత డేంజరస్‌గా మారుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇలాంటి ఓ సైబర్‌ నేరగాళ్ల ముఠా ఆటకట్టించింది తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో. పలు రాష్ట్రాలకు చెందిన సైబర్‌ క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు.

Also Read:Wine Shops: మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్

స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌… తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు…అంటూ సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుని నిండా ముంచుతున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడింది ఈ ముఠా. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై 453 కేసులుండగా… ఒక్క తెలంగాణలోనే ఈ ముఠాపై 66 కేసులు నమోదైట్లు గుర్తించారు పోలీసులు.

Also Read:Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..

ఈ ముఠా నుంచి 72 లక్షల 85 వేల 788 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. పలు రకాలుగా సైబర్‌ నేరాల భారిన పడిన బాధితులకు ఒక్క జూన్‌ నెలలోనే 3 కోట్ల 67 లక్షల 50 వేల రూపాయలను రీఫండ్‌ చేసినట్లు చెప్పారు పోలీసులు. పట్టుబడ్డ ముఠాపై ఆంధ్రప్రదేశ్‌లో 17, బీహార్‌లో 13, చత్తీస్‌ఘడ్‌, డామన్‌ డయూలో 3, ఢిల్లీలో 19, గుజరాత్‌తో 35, హర్యానాలో 6, జార్ఖండ్‌లో 2, కర్నాటకలో 74, కేరళలో 28, మధ్యప్రదేశ్‌లో 7, మహారాష్ట్రలో 53, ఒడిశాలో 3, పుదుచ్చెరిలో ఒకటి, పంజాబ్‌లో 12, రాజస్థాన్‌లో 16, తమిళనాడులో 34, పంజాబ్‌లో 4, ఉత్తరప్రదేశ్‌లో 36, వెస్ట్‌బెంగాళ్‌లో 16, జమ్ముకశ్మీర్‌లో 6, తెలంగాణలో 66 కేసులు చొప్పున దేశవ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయి.

Also Read:Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..

ముఠా నుంచి 34 మొబైల్‌ ఫోన్లు, 20 చెక్‌ బుక్స్‌, 17 డెబిట్‌ కార్డులు, 8 సిమ్‌ కార్డులు, 16 బ్యాంక్‌ పాస్‌ బుక్‌లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. పలు అకౌంట్లలో ఉన్న 72 లక్షల 85 వేల రూపాయలను ఫ్రీజ్‌ చేశారు.

Also Read:Radhika Yadav: రాధిక యాదవ్ హత్య కేసు.. నిందితుడి గురించి సంచలన విషయాలు..

హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు.. మాయమాటలు చెప్పి స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో ఏకంగా రెండున్నర కోట్లు కాజేశాడు. టోలిచౌకికి చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సప్‌లో లింక్‌ పంపి ఏకంగా 74 లక్షలు కాజేశాడు ఈ ముఠా సభ్యుడు. బొల్లారంకి చెందిన ఓ వ్యాపారి నుంచి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 45 లక్షల రూపాయలు కొల్లగొట్టింది ఈ ముఠా. లక్డీకపూల్‌ కి చెందిన ఓ వ్యక్తికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌‌లో డీలర్‌ ఇప్పిస్తానని ఆన్‌లైన్‌‌లో పరిచయం చేసుకుని 31 లక్షల రూపాయలు కాజేసింది ముఠా. ఇలా… ఈ ముఠా పలు రకాలుగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Also Read:Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..

25 మంది ముఠా సభ్యులపై కేసు నమోదు

పట్టుబడ్డ 25 మంది ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించారు. ముఠాలో 7 రాష్ట్రాలకు చెందిన 25 మంది సభ్యులు ఉన్నారు. వీరి ద్వారా… మిగతా సైబర్‌ నేరగాళ్ల ముఠాల ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ముఠా సభ్యుల నుంచి కూపీ లాగుతున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Exit mobile version