Test-20: క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. “టెస్ట్ -20” పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్‌లా రెండు ఇన్నింగ్స్ ఉండగా, టీ20 తరహాలో వేగంగా సాగబోయే ఈ కొత్త రూపం అభిమానులకు వినూత్న అనుభూతిని ఇవ్వబోతోంది. ఛాంపియన్షిప్ టోర్నీలాగా ఆడించాలని నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణీ భావిస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్ తొలి రెండు ఎడిషన్లు భారత్‌లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌ను విజయవంతం చేసి, ఆ తర్వాత ఫారిన్ దేశాలను విస్తరిస్తామని తెలిపారు. అయితే.. 13 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్‌ను రూపొందించారు. ఈ ఫార్మాట్‌లో రెండు జట్లు ఒకే రోజున తలో 20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి. అంటే మొత్తం 80 ఓవర్లు ఒకే రోజు పూర్తవుతాయని చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టెస్ట్ తరహాలో జరుగుతాయట.
టెస్ట్ ట్వంటీ ఫార్మాట్ ఎలా ఉంటుంది..?
మ్యాచ్ మొత్తం 80 ఓవర్లు ఉంటుంది. ప్రతి జట్టు రెండు ఇన్నింగ్స్ ఆడుతుంది, ఒక్కో ఇన్నింగ్స్‌కి 20 ఓవర్లు. మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరు రెండో ఇన్నింగ్స్‌కి యాడ్ చేస్తారు. టెస్ట్, టీ20 నియమాలను కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్ ఇది. మ్యాచ్ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు టెస్ట్ మ్యాచ్‌లా వ్యూహాత్మకంగా ఉంటుంది. మొదటి రెండు ఎడిషన్లు భారత్‌లోనే జరగనున్నాయి. మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యటించే లీగ్‌గా విస్తరించేలా ప్రణాళిక ఉందన్నారు. మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్, ఏబీ డివిలియర్స్ ఈ ఫార్మాట్‌ను కలిసి ఆవిష్కరించారు.
READ MORE: Saving: నెలల తరబడి హుండీలో దాచుకున్న డబ్బు.. తీరా హుండీ పగలగొట్టి చూస్తే…
