Tesla Cars : టెస్లా తొలి ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ నుండి భారతదేశానికి రానుంది. ఈ సంవత్సరం అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎలోన్ మస్క్ మధ్య జరిగిన సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టెస్లా కారు భారతదేశంలో కోట్ల రూపాయలకు లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ సమాచారం ప్రకారం టెస్లా కారు కేవలం రూ. 21 లక్షలకే భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఎట్టకేలకు, భారతదేశంలోకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలన్న మస్క్ చిరకాల స్వప్నం నెరవేరబోతుంది.
టెస్లా భారతదేశంలో ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటుంది. ఇందులో 13 పోస్టులకు భారతీయులు అప్లై చేసుకోవచ్చు. దీనిలో కంపెనీ బ్యాక్-ఎండ్, ఫ్రంట్‌లో పనిచేసే పోస్టులను చేర్చింది. ముంబై, ఢిల్లీలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. టెస్లా కారు.. మహీంద్రా E 6, టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లతో పోటీ పడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో రూ. 25 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వేరే రకమైన సునామీని టెస్లా తీసుకురాబోతుంది. ఎలక్ట్రిక్ వాహనాల రేసులో గట్టి పోటీ ఉండబోతుంది.
Read Also:Karnataka: నా ఫ్రెండ్తో నా వైఫ్ లేచిపోయింది.. సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడి
మారుతి ఈవీ ప్లాన్ ఏమవుతుంది?
ఇప్పటివరకు అందరూ మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను షేక్ చేస్తుందని భావించారు. కానీ మస్క్ టెస్లా అన్ని కంపెనీల హార్ట్ బీట్ ను పెంచింది. మారుతి ఈ విటారా ధర రూ. 20 నుండి 25 లక్షల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో టెస్లా కారు అందుబాటులోకి వస్తే ఇతర కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
భారతీయులకు సంపాదన అవకాశం
టెస్లా భారతీయులకు డబ్బు సంపాదించడానికి అవకాశం ఇచ్చింది. కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, టెక్నికల్ విభాగాలకు ఉద్యోగ ఖాళీలను విడుదల చేసింది. దీనిలో ఏ భారతీయుడైనా ఉద్యోగం కోసం నిబంధనలు, షరతులను చూసిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also:Tollywood : ఆ ఇద్దరు యంగ్ హీరోలు లైనప్ మాములుగా లేదు..