Site icon NTV Telugu

Sydney Attack: ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది.. హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్‌ పొందినట్లు గుర్తింపు

Hyd

Hyd

టెర్రరిస్టుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకపు ప్రజల మీద విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో సాజిద్ అనే ఉగ్రవాది కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో యూదులు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బోండి బీచ్ కాల్పుల్లో నిందితుడి సహా 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ సమయంలో అంతా ప్రాణభయంతో వణికిపోతుంటే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు.

Also Read:Luthra Brothers Arrest: ఇండియాకు లూథ్రా బదర్స్.. ఎయిర్ పోర్ట్‌లోనే అరెస్ట్

ఓ వైపు బుల్లెట్లు దూసుకొస్తున్నా.. ఎదురెళ్లి ఉగ్రవాది చేతిలోని గన్ లాక్కున్నాడు. అతడి తెగింపును యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అహ్మద్‌ను హీరో అంటూ కొనియాడారు. ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్‌ దగ్గర ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు సాజిద్‌ అక్రమ్‌ వద్ద ఇండియా పాస్‌పోర్ట్‌ లభ్యం అయ్యింది. సాజిద్‌ హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్‌ పొందినట్లు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి ఫిలిప్పిన్స్‌, పాక్‌ వెళ్లినట్లు నిఘా వర్గాల అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఉగ్ర లింకులు వెలుగుచూస్తుండడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Exit mobile version