Terror plans Busted: భారీ పేలుళ్ళకు కుట్ర.. కదులుతున్న ఉగ్రమూలాల డొంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంపై ఉగ్రమూకల కన్ను ఎప్పుడూ పడుతూనే వుంటుంది. నగరంలో భారీ పేలుళ్ల కుట్ర కేసును హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. లష్కరే తోయిబా నేత ఘోరీ ఆదేశాల మేరకు నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నారు. ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు నిన్న పాతబస్తీ పరిసర ప్రాంతంలో సోదాలు చేసి జాహిద్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుండి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టులో హాజరు పర్చడంతో రిమాండ్ విధించి చంచల్ గూడ జైల్ కు తరలించారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఉగ్ర మూలాల డొంక మరింతగా కదిలే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు సంబంధించి సిసిఎస్ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు ఉన్నాయి. ఈకేసును సిట్ కు బదిలీ చేసిన సిసిఎస్ విభాగం. నగరంలో బీజేపీ,ఆరెస్సెస్ కార్యక్రమాలు,దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసిందని కనుగొన్నారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నారు. A1జాహిద్ A2సమీఉద్ధిన్, A3హజీ హసన్ లు అరెస్ట్ చేసి నిందితులపై సెక్షన్ 18, 18(B),20 ఆఫ్ 1967 యాంటి సోషల్ ఎలవెంట్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాహిద్‌తోపాటు ఏడుగురిపై కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు. అదీల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై సైతం కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లో దాడుల కోసం పాకిస్థాన్ బేస్ హండ్లర్స్ నుంచి నాలుగు హాండ్ గ్రేనేడ్స్ హైదరాబాద్ కు చేరాయి.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!

నిర్మానుష్య ప్రాంతంలో హ్యాండ్ గ్రానడ్ పేల్చేందుకు ట్రైల్ నిర్వహిస్తుండగా సమాచారంతో పోలీసులు అలర్ట్ అయి ముగ్గురిని అరెస్ట్ చేశారు. గతంలో సైతం జాహిద్ అండ్ టీంపై పలు టెర్రరిస్ట్ కుట్ర కేసులు ఉన్నాయి. అరెస్టైన వారు అబ్దుల్ జాహిద్, సమిఉద్దీన్ అలియాస్ సమీ, మాజా అలియాస్ హసనన్ లు ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంచి విచారించారు. అనంతరం భారీ బందోస్తు మధ్య నిందితులను గాంధీ హాస్పిటల్ కు తరలించిళవైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చడంతో న్యాయస్థానం 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Read Also: Football Association : ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫీసులో చోరీ
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మొత్తం ఏడుగురి పేర్లను పెర్కొన్నారు. వారిలో జాహిద్, మాజ్, సమీఉద్దీన్, ఆదిల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషీ, అబ్దుల్ ఖలీమ్ పేర్లున్నాయి. అయితే ఈ కేసులో తొమ్మిది మందిని కీలకంగా భావిస్తున్నారు సిట్ పోలీసులు. వీరంత పాక్ హ్యాండ్లర్ తో టచ్ లో ఉంటూ, అక్కడి హ్యాండ్లర్ల సూచనల మేరకు జాహిద్ సిటీలో టీం ఫాం చేసుకున్నట్లు గుర్తించారు. డబ్బాశ చూపి పేదరికంలో ఉన్న యువతను లక్ష్యంగా చేరికలు జరిగినట్లు గుర్తించారు. దిల్ షుక్ నగర్ బ్లాస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించి పరార్ అయిన వ్యక్తి బిలాల్ సోదరుడే జాహిద్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
పాక్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో బిలాల్ మరణించాడు. బిలాల్ పాక్ లో ఉన్న సమయంలో విస్తరింప జేసిన నెట్వర్క్ లో ఉన్న కీలక వ్యక్తులతో ప్రస్తుతం జాహేద్ కు లింక్స్ ఉన్నాయిని గుర్తించారు. ఎంతమంది పాక్ హ్యాండర్లతో సంబంధాలు కల్గి ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. పాక్ ఉగ్ర వాద సంస్థ ఐసిసి, లష్కరే తోయిబా అనుబంధంగా వీరి మాడ్యూల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉనికి చాటడానికి నగరంలో పేలుల్లకు పథక రచన జరిగినట్లు ఈ మేరకు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరి కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని ఉగ్రవాద కుట్ర కోణాలు వెలుగుచేసే అవకాశం ఉంది.
Read Also: Tamannaah Bhatia: రెడ్ చీర లో తమన్నా.. అందమే అసూయ పడునమ్మా
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?