Site icon NTV Telugu

Terror Attack Averted: తప్పిన భారీ ఉగ్రదాడి.. 15 కిలోల పేలుడు పదార్థాలు నిర్వీర్యం

Jammu

Jammu

Terror Attack Averted: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి తప్పింది. జమ్మూలోని ఉదంపూర్‌ జిల్లాలో 15 కిలోల బరువున్న ఐఈడీని పోలీసులు నిర్వీర్యం చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. సోమవారం బసంత్‌గఢ్ ప్రాంతంలో స్థూపం ఆకారంలో ఉన్న ఐఈడీ, 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, ఏడు 7.62 ఎంఎం క్యాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్‌లను స్వాధీనం చేసుకోవడంతో పెద్ద టెర్రర్ ప్లాన్‌ తప్పిందని వారు తెలిపారు. ఐఈడీని మంగళవారం సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.

Fake Liquor : నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారులు అరెస్ట్

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version