Site icon NTV Telugu

Mumbai: ముంబైకి ఉగ్రదాడి బెదిరింపులు.. పోలీసులు అలర్ట్

Mumbai

Mumbai

Mumbai: ముంబైలో బాంబు దాడికి పాల్పడతామంటూ ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ తాలిబానీ సభ్యుడిగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మెయిల్ అందిందని పోలీసు వర్గాలు ఇవాళ తెలిపాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వివిధ నగరాలను, ముంబైపోలీసులను ఎన్‌ఐఏ అప్రమత్తం చేసింది. “బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తనను తాను తాలిబానీగా పేర్కొన్నాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందని అతను చెప్పాడు” అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. బెదిరింపు మెయిల్ తర్వాత, నిజాన్ని వెలికితీసేందుకు ముంబై పోలీసులతో పాటు ఎన్‌ఐఏ సంయుక్త దర్యాప్తు ప్రారంభించింది.

ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు మంగళవారం బెదిరింపు కాల్ వచ్చింది. అందులో గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలను పేల్చివేస్తానని బెదిరించాడు.ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలోని ల్యాండ్‌లైన్‌కు సాయంత్రం 4:30 గంటలకు కాల్ వచ్చింది. స్కూల్‌లో టైం బాంబ్ పెట్టినట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు.

Shocking : పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు

గతేడాది అక్టోబరులో నగరంలోని పలు ప్రాంతాల్లో అమర్చిన బాంబుల గురించి తెలియజేస్తూ ఇదే తరహా కాల్ వచ్చింది.నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు ముంబై పోలీసులకు గుర్తుతెలియని కాలర్ నుంచి ‘అనుమానాస్పద’ కాల్ వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో మూడు బాంబులు అమర్చినట్లు కాల్ చేసిన వ్యక్తికి కాల్ వచ్చింది. ముంబై పోలీసులు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version