పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని విద్యార్థులతో పాటు పరీక్షలు పాస్ అవ్వడం అంత వేరు. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలా చాలామంది ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలినస్తున్నారు కొందరు. ఇది ఇలా ఉండగా ఇలాంటి వారికి తాజాగా మహారాష్ట్రకు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే యువకుడి జర్నీ చూస్తే ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారేమో. ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూస్తే..
మహారాష్ట్రకు చెందిన కృష్ణ 2018లో మొదటిసారి పదవ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నిర్వహించే రెండుసార్లు పరీక్షలలో హాజరవుతున్న కానీ వరుసగా తొమ్మిది సార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినా కానీ కృష్ణ ఓ పట్టువదలని విక్రమార్కుడిలా పదోసారి తన ప్రయత్నాన్ని చేస్తూ విజయాన్ని సాధించాడు. పదవసారి రాసిన పరీక్షలలో కృష్ణ పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాడు.
అయితే అతడి పదవ తరగతి ఉతీర్ణతను గ్రామ ప్రజలు అంత సులువుగా పక్కన తీసి పడేయలేదు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని గ్రామస్తులందరూ భుజాలపై ఎత్తుకొని బ్యాండ్ మేళంతో పటాకులు కాలుస్తూ గ్రామంలోని వీధుల్లో ఊరేగిస్తూ వేడుకలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.