రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు పెట్రేగిపోతున్నారు. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు తండ్రి లేడు. తల్లితో పాటు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే.. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి చూసుకోవాల్సిన మేనమామ తన పాలిట క్రూరత్వం ప్రదర్శించాడు.
Read Also: Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో మేనమామ తన సొంత మేనకోడలిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జహాన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు డయల్-112కు సమాచారం అందిందని.. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులను, కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
నిందితుడు మహ్మద్ అన్సార్ (35)గా గుర్తించారు. కాగా.. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వృత్తిరీత్యా డ్రైవర్. పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లి మాట్లాడుతూ.. తన భర్త ఈ లోకంలో లేడని చెప్పింది. ఆమె తన తల్లి ఇంటిలో నివసిస్తుంది. తన కూతురిపై అత్యాచారం చేసింది తన సోదరుడేనని పేర్కొంది. తన కూతురు పదో తరగతి చదువుతోందని తెలిపింది. ఆ తర్వాత.. తల్లి స్పృహ తప్పి పడిపోయింది.