NTV Telugu Site icon

Tenth Exams: రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

New Project (6)

New Project (6)

Tenth Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2652 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. ఈ సారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Also: Sonusood: సోనూ సూద్ పేరిట మోసం.. రూ.69వేలు స్వాహా

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని జిల్లాలకు చెందిన డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయ్యాయి. పరీక్షల సమయంలో విధులు నిర్వహించేందుకు నియమించిన సిబ్బందిందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ అయ్యాయి. ఆరోగ్య శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎంను డిప్యూట్ చేస్తుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా TSRTC సమయానికి ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుంది. ప్రిపరేషన్ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుంది.

Read Also: Son In Law Protest: అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన