NTV Telugu Site icon

Tension in Ippatam: ఇప్పటంలో టెన్షన్.. జనసేన నేతల ఆందోళన

Ippatam, 1

Ippatam, 1

గుంటూరు జిల్లా ఇప్పటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. గుడి నుంచి జనసేన నేతలను వెలుపలకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఇప్పటికే జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటం గ్రామంలోకి వెళ్లే వారి ఐడీ కార్డులు చెక్ చేశారు పోలీసులు. కాసేపటి క్రితం ఇప్పటం రామాలయం నుంచి బయటకు వచ్చారు జనసేన నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లి. ఇప్పటంలో కూల్చివేతల వద్దకు వెళ్ళారు జనసేన నేతలు. ఇళ్ల కూల్చివేతలు జరపమని.. మున్సిపల్ అధికారులతో మాట్లాడిద్దామని పోలీసుల హామీతో జనసేన నేతలు వెనక్కి తగ్గారు. మున్సిపల్ అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు జనసేన నేతలు.కూల్చివేతల ప్రాంతంలోనే జనసేన నేతల భైఠాయింపుతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read Also:300 Stones In Kidney : ఏం తాత కిడ్నీలో ఇన్ని రాళ్లు పోగేశావా..?

ఇదిలా ఉంటే.. ఇప్పటంలో ఆందోళన చేస్తున్న జనసేన నేతలతో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు భేటీ అయ్యారు. రికార్డుల ప్రకారమే తాము కూల్చివేతలు చేపడుతున్నామంటున్నారు అధికారులు. తడవకో మార్కింగ్ ఇవ్వడమేంటంటూ అధికారులను ప్రశ్నించారు జనసేన నేతలు.

Read Also: 300 Stones In Kidney : ఏం తాత కిడ్నీలో ఇన్ని రాళ్లు పోగేశావా..?</a

Show comments