High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
- చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
- ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే మేరి మాత విగ్రహం ఏర్పాటు
- తొలగించాలని స్థానికులను ఆదేశించిన మున్సిపల్ అధికారులు
- విగ్రహాన్ని తొలగించే క్రమంలో ఉద్రిక్త వాతావరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension in Tenali: గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు. మున్సిపల్ అధికారులు కాల్వలు శుభ్రం చేసే క్రమంలో నిన్న మురుగు కాల్వ పక్కన శుభ్రం చేసి వెళ్ళగా స్థానికులు మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతులు లేవని బొమ్మ తొలగించాలని స్థానికులను మున్సిపల్ అధికారులు ఆదేశించారు.
Read Also: Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
Also Read
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
బొమ్మ తొలగించటం కుదరదని మున్సిపల్ అధికారులకు స్థానికులు అడ్డం తిరిగారు. పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు బొమ్మను తొలగించారు. బొమ్మ తొలగించే క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బొమ్మ తొలగించే క్రేన్‌పై స్థానికులు రాళ్లు విసరగా.. డ్రైవర్‌కు స్వల్పగాయం అయింది. ఘర్షణకు కారణమైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేరీ మాత విగ్రహం తొలగిస్తే పక్కనే ఉన్న నిత్యం పూజలు అందుకునే అంకమ్మ తల్లి విగ్రహాన్ని కూడా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికుల డిమాండ్ మేరకు చెట్టు కింద ఉన్న దిమ్మను కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు. తెనాలిలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీ చార్జీలో పలువురికి గాయాలయ్యాయి. త్రీ టౌన్ సీఐ డౌన్‌డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?