Site icon NTV Telugu

Tension in Nirmal: సంజయ్ పాదయాత్రకి నో పర్మిషన్… నిర్మల్ లో టెన్షన్

Band1

Band1

రేపటి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి నిరాకరించారు…ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర రేపు బైంసా నుంచి ప్రారంభం కానుండగా పోలీసులు అనుమతి తిరస్కరించారు..శాంతిభద్రతల దృష్య్టా పాదయాత్ర సభకు అనుమతి లైదని బైంసా పోలీసులు ప్రకటన విడుదల చేశారు…దీనిపై జిల్లాఎస్పీ సైతం పాదయాత్రకోసం అనుమతి అడిగారు నిరాకరించామని ధృవీకరించారు..అలాగే సభ కోసం ఎలాంటి అనుమతి అడగలేదన్నారు.. ఇప్పటికే బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Read Also:Rajamouli: హాలీవుడ్ సినిమా చేస్తారా అన్న ప్రశ్నకి జక్కన సూపర్ సమాధానం…

కాని పోలీసుల నుంచి అందుకు అనుమతి రాలేదు…ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర సభ నిర్వహించి తీరుతామని రేపు బిజెపి నేతలు పట్టుదలతో ఉన్నారు….రేపు బీజేపీలో చేరబోతున్న రామారావ్ పటేల్ వీడియో రిలీజ్ చేశారు. నిర్మల్ వెళుతున్న బండి సంజయ్ ను జగిత్యాల దాటాక అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను చుట్టుముట్టారు పోలీసులు… పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ కార్యకర్తలు, నేతలు.

దీంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు రేపు సభకు వెళ్లి తీరుతానని ప్రతిన బూనారు బండి సంజయ్. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అవసరమయితే న్యాయస్థానం తలుపు తడతాం అన్నారు బండి సంజయ్. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర కు వెళుతుంటే అడ్డుకుంటారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.

రేపు మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉంది. అప్పటివరకు వెయిట్ చూస్తాం.. తరవాత న్యాయస్థానం తలుపు తడతాం అన్నారు బండి సంజయ్. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్రకు వెళుతుంటే అడ్డుకుంటారా?పోలీసుల వినతి మేరకు నేను ఇప్పుడు కరీంనగర్ పోతున్నా అన్నారు బండి సంజయ్.

Read Also: Rapthadu Heat: వైసీపీ ఎమ్మెల్యే సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Exit mobile version