NTV Telugu Site icon

Penamaluru: రసవత్తరంగా పెనమలూరు టీడీపీ రాజకీయం..!

Penamaluru

Penamaluru

Penamaluru: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనా.. పెనమలూరు పంచాయితీ ఒడవడంలేదు.. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టికెట్‌ ఇచ్చేదిలేదని చెప్పేసినా.. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తన ప్రయత్నాలు మాత్రం ఆపడంలేదు. ఇప్పటికీ టికెట్‌ తనకే వస్తుందని నమ్ముతున్నారు బోడే ప్రసాద్‌. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో బోడే ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లిద్దరితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే బోడే ప్రసాద్‌కు టీడీపీ టికెట్‌ ఇవ్వలేదని వాటి సారాంశం. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు బోడే ప్రసాద్‌. వారితో సన్నిహితంగా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్‌ విసురుతున్నారు.

Read Also: Arvind Kejriwal Arrested: అరెస్ట్‌ అయినా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించనున్న కేజ్రీవాల్

పెనమలూరు నుంచి వైసీపీ తరపున మంత్రి జోగి రమేష్‌ పోటీ చేస్తున్నారు. అందుకే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. బోడే ప్రసాద్‌కు టికెట్‌ నిరాకరించి… దేవినేని చందు, మాజీ మంత్రి ఆలపాటి రాజాల పేర్లను పరిశీలిస్తోంది. ఇందుకోసం సర్వేలు కూడా చేస్తున్నారు. టీడీపీ వేరే ఎవరికైనా టికెట్‌ ఇస్తే… ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అయినా పోటీ చేసేందుకు బోడే ప్రసాద్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పెనమలూరు టికెట్‌పై టీడీపీలో ఆసక్తిర చర్చ జరుగుతోంది. మైలవరం సీటు వసత కృష్ణ ప్రసాద్‌కు ఇస్తే.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరును పెనమలూరుకు పరిశీలిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. సర్వేలు చేయించినా.. ఇప్పటికీ అభ్యర్థి విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో.. పెనమలూరు టికెట్‌పై టీడీపీలో హై డ్రామా కొననసాగుతోంది. కాగా, పెనమలూరుతో పాటు టీడీపీ మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టిన విషయం విదితమే.. మరి పూర్తిస్థాయి లిస్ట్‌ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో.. పెనమలూరు సీటుపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచిచూడాలి.