Site icon NTV Telugu

Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు..

Rajahmundry

Rajahmundry

రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర హైటెన్షన్‌ నెలకొంది. సిట్‌ అధికారులు కాసేపట్లో ఎంపీ మిథున్‌ రెడ్డిని తీసుకురానున్నారు. దీంతో సెంట్రల్‌ జైలు దగ్గరకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు సైతం భారీగా తరలివచ్చారు. జైలు గేటుకు కొంత దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడే నిలువరించారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్ట్ ఒకటో తేదీ వరకూ మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

READ MORE: YS Jagan: “ఇదే టీడీపీ అసలు ఎజెండా”.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్..

Exit mobile version