Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tenali: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం ప్రకారం.. తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విషయంలో బంగారం రికవరీ కోసం పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని తిరుపతమ్మ ఆరోపించింది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.
కొన్ని సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి వాచ్‌మన్‌గా పనిచేసిన తిరుపతమ్మపై, అదే అపార్ట్మెంట్లో నివసించే ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, చేయని నేరంలో ఇరికించి వేధింపులకు గురి చేస్తున్నారని తిరుపతమ్మ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. పోలీసుల ఒత్తిడి, మానసిక వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను వెంటనే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.దీనితో తిరుపతమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!