Gulf Food Festival: ఈ నెల 19 నుంచి 23 వరకు దుబాయిలోని దుబాయి ట్రేడ్ సెంటర్‌లో, 22వ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 127 దేశాల నుంచి పలు ఆహార సంస్థల తయారీదారులు వీక్షకులుగా వచ్చారు. అక్కడ తెనాలి డబల్ హార్స్ సంస్థ తన స్టాల్‌ని ఏర్పాటు చేసింది. తెనాలి డబల్ హార్స్ సంస్థ ఇటీవలి కాలంలో తన ఉత్పత్తుల విస్తృతిని బాగా పెంచి, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తమ ప్రాడక్టులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెనాలి డబల్ హార్స్ ఉత్పత్తులను పలు దేశాల ప్రతినిధులు ఇక్కడ వీక్షించి, చక్కని అనుభూతిని చెందారు.
ఈ సందర్భంగా తెనాలి డబల్ హార్స్ సంస్థ ప్రపంచ ప్రమాణాలను, ప్రపంచ మార్కెట్ అవసరాలను, భవిష్యత్ వ్యూహాలని అర్థం చేసుకోవటంలో ఈ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది అని, అలాగే తెనాలి డబల్ హార్స్ సంస్థ ఉత్పత్తులు ప్రపంచ దేశాల ప్రజలకు, ప్రతినిధులకు బాగా చేరువయ్యాయని.. అలాగే రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ గ్లోబల్‌తో ముందుకెళుతున్నాం అని తెనాలి డబల్ హార్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల శ్యామ్ ప్రసాద్ వివరించారు.