మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే. అది ఆ పేరుకున్న క్యాపబిలిటీ. మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరు. శుక్రవారం నాడు ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో లక్నో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాడు మ్యాచ్లో లక్నో స్టేడియంలో మెజారిటీ ప్రేక్షకులు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి పెద్ద ఎత్తున సపోర్టుగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించి ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నిజానికి గ్రౌండ్ లోని దృశ్యాలను చూస్తే మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా చెన్నై నగరంలో జరుగుతుందంటే కచ్చితంగా నమ్మేస్తారు.
Also read: Manchu Vishnu : ఆ సూపర్ హిట్ మూవీస్ రీమేక్ చేయాలనీ ఉంది..
ఇలాంటి సమయంలో ధోని బ్యాటింగ్ కోసం గ్రౌండ్ లోకి వచ్చే సమయంలో అయితే చెవులు చిల్లులు పడటం ఖాయం. నిజంగా అలా ఉంటుంది ధోని క్రేజ్. శుక్రవారం నాడు ధోని గ్రౌండ్ లోకి రావడం కాస్త ఆలస్యమైన కేవలం 9 బంతులలో ఏకంగా మూడు ఫోర్స్, 2 సిక్సర్లు సహాయంతో 28 పరుగులు రాబట్టాడు. దాంతో గ్రౌండ్లో ధోని నామస్మరణ హోరెత్తింది.
Also read: Son Stabbed Mother: దారుణం.. కన్నతల్లిని కత్తితో పొడిచిన కసాయి కొడుకు
ఇక ఈ విషయం సంబంధించి.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్, సౌత్ఆఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ భార్య సాషా పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్ లోకి వస్తున్న సమయంలో గ్రౌండ్ లోని ధ్వని తీవ్రత ఏకంగా 100 డెసిబల్స్‌ను దాటేసింది. గ్రౌండ్లో ఎక్కడ చూసినా ధోని నామస్మరణ. అలా కేవలం ఒక్క పది నిమిషాల పాటు ఇలాగే ఉండిపోతే మనలో ఎవరికైనా తాత్కాలిక వినికిడి లోపం రావడం ఖాయం అంటూ తన స్మార్ట్ వాచ్ చూపించిన సందేశాన్ని ఆవిడ పోస్ట్ చేసింది. అలాగే తల కొట్టుకుంటున్నట్లుగా ఓ ఎమోజిని కూడా జత చేసింది. ఇక ఈ పోస్టు చూసిన ధోని ఫ్యాన్స్ ఆ పోస్ట్ పై తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ధోని తలా అంటే ఓ ఎమోషన్.. అది కేవలం అతనికి మాత్రమే సాధ్యమవుతుందంటూ.. అందుకే జోరు, హోరు ఏదేమైనా మనోడి లెవలే వేరు అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.