దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. మొదటి 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కెప్టెన్‌గా బవుమా రికార్డుల్లో నిలిచాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 విజయాలు ఉండగా.. ఒక్క డ్రా ఉంది. బవుమా కెప్టెన్సీలో ప్రొటీస్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. బవుమా ఖాతాలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ విజయం కూడా ఉంది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో 13 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. అంతేకాదు 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రొటీస్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇది. భారత జట్టును ఓడించడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంత కీలక పాత్ర పోషించారో.. కెప్టెన్ బవుమా కూడా అంతే పోషించాడు. బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌పై 55 పరుగులు చేయడమే కాకుండా.. అద్భుతమైన సారథ్యం చూపాడు.
మొదటి 11 టెస్ట్‌ల్లో అత్యధిక టెస్ట్ విజయాలు (2024-25) సాధించిన కెప్టెన్‌గా టెంబా బావుమా ఉన్నాడు. బావుమా తర్వాతి స్థానంలో వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆస్ట్రేలియా) ఉండగా.. 1920-1921 మధ్య 10 టెస్ట్‌ల్లో 8 విజయాలు సాధించి, రెండు డ్రాలు ఉన్నాయి. బ్రియాన్ క్లోజ్ 1949-1976 మధ్య 7 టెస్ట్‌ల్లో 6 విజయాలు సాధించి, 1 డ్రా ఉంది.చార్లెస్ ఫ్రై (ఇంగ్లాండ్) ఖాతాలో 6 టెస్ట్‌ల్లో 4 విజయాలు సాధించి, రెండు డ్రాలు ఉన్నాయి.
