NTV Telugu Site icon

TDP Mahanadu: రాజమండ్రిలో మే 27,28 తేదీల్లో మహానాడు

Atchanna 1

Atchanna 1

మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరుగనున్న మహానాడు వేదిక స్థలాన్ని టిడిపి బృందం పరిశీలించింది. బృందంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెయ్యనాయుడు , పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప ,గోరంట్ల బుచ్చియ్యచౌదరి , జిల్లాకు చెందిన టిడిపి ముఖ్యనేతలు విచ్చేసి పరిశీలిన చేశారు. జాతీయ రహదారికి అనుకుని రాజమండ్రి- రూరల్ వేమగిరిలో మహానాడు నిర్వహణకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు -అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ మహానాడు కోసం 15 కమిటీలు వేశామని తెలిపారు. ఈసారి ఏన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం శుభపరిణమమని పేర్కొన్నారు.ఈసారి మహానాడు మే 27 28 తేదీన రెండు రోజులు ఉంటుందన్నారు.27న ప్రతినిధుల సభ హైవేకి అవతల వైపు, 28న భారీ బహిరంగ సభ హైవేకి ఇవతల వైపు రెండు స్థలాల్లో పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

Read Also: KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

ఊహకందని విధంగా నభూతో.. న భవిష్యత్తు అన్న తీరులో రాజమండ్రిలో మహానాడు ఉండబోతుందని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం దిశగా మహానాడు ఉండబోతుందని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. 1994లో అధికారంగా లోకి వచ్చే ముందు రాజమండ్రిలోనే సభ పెట్టామని అన్నారు. మళ్ళీ ఏపిని అభివృద్ధిలో నడిపించే విషయాలు మహానాడులో రానున్నాయని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు జరిగే మహా నాడును పెద్ద ఎత్తున జరపబోతున్నామని. అన్నారు. రాజమండ్రిలో మహానాడుతో 175/175 గెలిచే దిశగా ముందుకు వెళ్ళబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also:CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు