NTV Telugu Site icon

Minister Nara Lokesh: సౌదీలో తెలుగు వ్యక్తి కష్టాలు.. డోంట్‌ వర్రీ..! నేను ఉన్నానంటూ మంత్రి లోకేష్‌ హామీ..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో.. ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఒక దగ్గర ఉద్యోగం అని చెప్పి.. మంచి జాబ్‌ అని చెప్పి నమ్మబలికి.. అందినకాడికి దండుకొని.. ఏదో చెత్తపనిలో తోసేసి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ఏజెంట్లు.. అయితే, కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ ఘటన మరువక ముందే.. ఇప్పుడు వీరేంద్ర కుమార్‌ అనే మరో వ్యక్తి సౌదీలో చిక్కుకున్నాను.. కాపాడండి బాబోయ్‌ అంటూ.. సోషల్‌ మీడియాలో ఓ వీడియో పెట్టాడు.. అది కాస్తా మంత్రి నారా లోకేష్‌ వరకు చేరడంతో.. డోంట్‌ వర్రీ..! నేను ఉన్నానంటూ హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌..

Read Also: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్

ఇక, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. నా పేరు సరెల్ల వీరేంద్ర కుమార్.. ఓ ఏజెంట్‌ ఖతార్ అని చెప్పి తీసుకెళ్లి.. సౌదీ అరేబియాలో వదిలేశారు అని ఆ వీడియోలో వాపోయాడు.. 10వ తేదీన తాను ఖతార్‌ వచ్చాను.. ఆ తర్వాత 11వ తేదీన సాయంత్రం సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చారు.. ఈ ఏడారిలో నన్ను పడేశారు.. నా ఆరోగ్యం బాగోలేదు.. రక్తంతో వాంతులు అవుతున్నాయి.. ముక్కు నుంచి కూడా రక్తం కారుతోంది.. ఎవరైనా పెద్ద మనసు చేసుకుని.. నాకు సాయం చేయండి.. ఈ నరకం నుంచి నన్ను బయటపడేయండి అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.. నేను ఖతార్‌ రావడానికి ఏజెంట్‌కు రూ.1.70 లక్షలు అప్పుచేసి ఇచ్చాం.. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు, నీరు లేదు, తిండి లేదు.. ఈ ఒంటెల దగ్గర నేను ఉండలేకపోతున్నాను.. మరో పది రోజులు ఇక్కడే ఉంటే.. నేను చనిపోయే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వీరేంద్ర కుమార్‌.. ఇక, ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. వీరేంద్ర కుమార్‌ వీడియోపై స్పందించారు.. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువస్తాం వీరేంద్రా! డోంట్‌ వర్నీ అంటూ ట్వీట్‌ చేశారు..

కాగా, కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. ఆ వ్యక్తిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చిన విషయం విదితమే.. కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కువైట్‌ నుంచి తన స్వగ్రామానికి చేరుకున్నారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్‌ చేసిన విషయం విదితమే. నెల రోజుల ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏజెంట్ సాయంతో కువైట్‌ వెళ్లిన శివను అక్కడ పని పేరుతో హింసకు గురి చేశారు. దీంతో తనను కాపాడాలని, లేకపోతే మరణమే శరణ్యం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎంబసీని సంప్రదించి శివను ఇండియాకు రప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శివను ఇండియాకు రప్పించేలా ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. శివ సేఫ్‌గా ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేసిన విషయం విదితమే.

https://x.com/naralokesh/status/1814359817592680966