NTV Telugu Site icon

Golden Gavel Award: అమెరికాలో తెలుగు వాడి సత్తా..పిట్ట కొంచెం కూత ఘనం

Golden Award

Golden Award

అమెరికాలో తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక గోల్డన్ గావెల్ ( టాప్‌ స్పీకర్‌ ) అవార్డు గెలుచుకున్న సాహిత్‌ మంగు తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించాడు. గార్డెన్‌ స్టేట్‌  డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో విజేతగా ఈ 12 ఏళ్ళ కుర్రాడు నిలిచాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి నిజం చేస్తూ.. తన ప్రసంగాలతో అదరగొడుతున్నాడు 12 ఏళ్ళ కుర్రాడు. న్యూజెర్సీలో సోమర్‌సెట్‌లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న సాహిత్ మంగు ప్రతిష్టాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.  న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా గార్డెన్ స్టేట్ డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 04, 2023న, వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్‌ మంగు గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు దక్కించుకున్నాడు.

Read Also:Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియా భూకంపం.. 7,800 మందికి పైగా మృతి

12 ఏళ్ల ఈ కుర్రాడి టాపిక్‌లు, డిబేటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌పై చేసిన అసాధారణ పరిశోధనలకు న్యాయ నిర్ణేతలు, ఉపాధ్యాయులు, తొటి స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. భారత్‌ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం తనది. అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన ఇండో అమెరికన్ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్‌ మంగు తన ప్రసంగాలతో అదరగొడుతున్నాడు. ప్రస్తుత అవార్డుతో పాటు, పాఠశాలలో పాటలు పాడటం, డిబేట్‌లో పాల్గొనటంతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. విద్యార్థులకు డిబేట్‌లలో సహాయం చేయడానికి జాతీయ లాభాపేక్ష లేని డిబేట్ క్లబ్‌లో పనిచేస్తున్నారు సాహిత్. వివిధ సంస్థల నుండి కోచ్‌లు మరియు సలహాదారులతో, డిబేట్ క్లబ్ వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెడుతుంది.

న్యూజెర్సీలోని వివిధ పాఠశాలల నుండి మొత్తం 164 మంది విద్యార్థులు నాలుగు అంశాలను కవర్ చేస్తూ గార్డెన్ స్టేట్ లీగ్‌లో పాల్గొన్నారు. అతను ఎంచుకున్న అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
* సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించాలి.
*అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావాలి.
* ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ.
* శాఖాహారమే మంచిది, మాంసాహారం సరైంది కాదు
మరో ఫ్రెండ్‌తో కలిపి డిబేట్‌లో పాల్గొన్న సాహిత్ 4 టోర్నమెంట్లలో మొత్తం నాలుగూ గెలుచుకున్నాడు. నాలుగు అంశాల్లోనూ ధాటిగా తన వాదనను వినిపించి జడ్జిలను మెప్పించాడు సాహిత్.  ఫైనల్‌గా టాప్‌లో నిలిచి గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డును అందుకున్నాడు.12 ఏళ్ల ఇండో అమెరికన్ కుర్రాడు ఈ అరుదైన అవార్డు అందుకోవటం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇక టాప్ 10 విజేతలలో సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌తో పాటు విల్బర్‌ఫోర్స్ స్కూల్, విలియం అన్నీన్ మిడిల్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు.

Read Also: AP Cabinet Meet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలపై చర్చ

Show comments