TFPC: తెలుగు చలన చిత్రాలకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల శ్రేయస్సు కోరి తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్ 8వ తేదీన జరిగిన మండలి అత్యవసర మీటింగ్‌లో సంక్రాంతి, దసరా పండుగలకు డైరెక్ట్‌గా తెలుగులో వచ్చిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ వెల్లడించారు.
Special Focus On Cardiac Arrests Live: జిమ్ లు ప్రాణాలు తీస్తున్నాయా?
ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ దిల్‌రాజు తెలుగు సినిమాలు ఉండగా.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని 2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఆ ప్రకారమే తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని టి. ప్రసన్నకుమార్ తెలిపారు. బట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ డైరెక్ట్ తెలుగులో తీసిన చిత్రాలకు ప్రథమ ప్రాధ్యానత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను ఆయన కోరారు. సంక్రాతి, దసరా పండుగల సమయంలో మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ చిత్రాలకు కేటాయించాలని ఆయన కోరారు.