NTV Telugu Site icon

Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్న‌త స్థానాల్లో తెలుగు వారు!

Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్ర‌పంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యార్థులు పారిశ్రామిక‌వేత్తలుగా మారి.. ఇత‌రుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే స్థాయికి ఎద‌గాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎన‌ర్జీదే ప్ర‌ముఖ పాత్ర అని పేర్కొన్నారు. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌రిశోధ‌న‌ల ద్వారా విద్యార్థులు కొత్త వాటిని క‌నుగొనాలని మంత్రి చెప్పుకొచ్చారు. విజ‌య‌వాడ సిద్ధార్థ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… ‘సీఎం చంద్ర‌బాబు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్ర‌పంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారు. విద్యార్థులు పారిశ్రామిక‌వేత్తలుగా మారి.. ఇత‌రుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే స్థాయికి ఎద‌గాలి. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎన‌ర్జీదే ప్ర‌ముఖ పాత్ర. ప‌రిశోధ‌న‌ల ద్వారా విద్యార్థులు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే వాటిని క‌నుగొనాలి. ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌ల నుంచి రైతులను ర‌క్షించే విధంగా ఇంజ‌నీరింగ్ విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌లు ఉండాలి. సూర్య ఘర్, కుసుమ్ ప‌థ‌కాల‌తో రైతుల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రికీ నాణ్య‌మైన విద్యుత్ త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి వ‌స్తుంది’ అని తెలిపారు.