AP People Returned From Nepal: నేపాల్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న తెలుగు ప్రజలు ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్నారు. తాము అక్కడ ఉన్నన్ని రోజులు భయం భయంగా గడిపామని.. రోడ్లపై రాడ్లు, ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు తిరుగుతున్నారని తెలుగు యాత్రికులు తెలిపారు. మరవైపు రాష్ట్రానికి చేరుకున్న యాత్రికులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. జన్ జెడ్ ఆందోళనలో భాగంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో, విదేశాంగ శాఖ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా నగరాల్లో చిక్కుకున్న వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసు.. నేటితో ముగియనున్న రిమాండ్.. బెయిల్ వస్తుందా?
ప్రజలకు ఏదైనా సమస్య వస్తే తమను సంప్రదించాలని నేపాల్లో రాయబార కార్యాలయం సూచించింది. నేపాల్లో చిక్కుకుపోయిన 212 మంది పైగా తెలుగు పౌరులను వారి స్థానాలను గుర్తించింది. ప్రభుత్వం వారితో స్వయంగా మాట్లాడి వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరుల శ్రేయస్సుపై అధికారులతో ప్రధాన కార్యదర్శి చర్చించారు. నేపాల్ లో చిక్కుకుపోయిన వారిలో కడప, నంద్యాల, మదనపల్లె, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలుకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఎంతో ఆనందంగా తీర్థ యాత్రలకు బయలుదేరిన తెలుగు యాత్రికులకు నేపాల్, కాట్మండులో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
Saiyaara OTT: ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా.. ఎందులో చూడచ్చంటే?
ఏపీ లోని వివిధ ప్రాంతాల నుంచి 10 రోజులు టూర్ కోసం బయలుదేరిన వారంతా అక్కడికి చేరుకున్న ఐదారు రోజుల తర్వాత అక్కడ చిక్కుకున్నారు. ఆందోళనకారులు చేసిన రాళ్ల దాడిలో గాయాల పాలై ప్రాణాలను అరచితలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఏపీ ప్రభుత్వం చరవతో రోజుల వ్యవధలోనే సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. విహార యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మంది క్షేమంగా తిరిగి వచ్చారు. నేపాల్ భయానక పరిస్థితుల నుంచి తాము ఇంత త్వరగా స్వస్థలానికి చేరుకుంటామని అనుకోలేదన్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన యాత్రికులు ప్రభుత్వ కృషితో తమ ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకోవడమే కాదు.. మారుమూల ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం గ్రామానికి వాహనం ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చినందుకు హర్షం వ్యక్తం చేశారు బాధితులు.
