Site icon NTV Telugu

Jahnavi Dangeti: తెలుగోడి సత్తా అంతరిక్షం దాకా.. స్పేస్ మిషన్‌లో వ్యోమగామిగా ఎన్నికైన తెలుగు బిడ్డ జాహ్నవి..

Jahnavi Dangeti

Jahnavi Dangeti

Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయ మహిళగా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె Astronaut Candidate (ASCAN)గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు NASA మాజీ వ్యోమగామి, రిటైర్డ్ కల్నల్ విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు.

Read Also:Jasprit Bumrah: అప్పటివరకు క్రికెట్ ఆడుతా.. బుమ్రా కీలక వ్యాఖ్యలు!

ఈ సందర్బంగా జాహ్నవి మాట్లాడుతూ.. 2026 నుంచి రాబోయే మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్‌లో కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నాను. ఈ శిక్షణలో తాను ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్‌ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు ఉండనున్నాయి. 2029లో ఐదు గంటలపాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌ ద్వారా శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

జాహ్నవి పాలకొల్లులో జన్మించి అక్కడే పెరిగింది. బీటెక్ పూర్తిచేసిన ఆమెకు చిన్నపాటి నుండే ఆమెకు అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి. ఇందులో భాగంగానే 2022లో పోలాండ్‌ లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రం (AATC)లో శిక్షణ పొందిన జాహ్నవి, అతి చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి. అవును అది ఎలా అంటే.. అప్పటి వరకు భారతదేశం నుంచే కాదు, ఆసియా ఖండం నుంచి పాల్గొన్న ప్రోగ్రామ్‌ లో తొలి సందర్భం అది.

Read Also:RK Roja: అది ఫేక్ వీడియో.. ఎక్కడికైనా వెళ్లి టెస్ట్ చేసుకోమనండి‌..

ఇకపోతే జాహ్నవి ఇప్పటికే చిన్న రాకెట్ అయిన ‘సెస్నా 171 స్కైహాక్’ ను విజయవంతంగా నడిపి రికార్డ్ సృష్టించింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్‌ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందింది కూడా. ఆమె 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించిందంటే నమ్మండి. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె నేర్చేసుకుంది. స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో గ్రావిటీయేని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంది.

తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగాల్లో ఉండడంతో జాహ్నవి విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఆమె అమ్మమ్మ లీలావతి. అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చందమామ కథలు వింటూ పెరిగింది. ఆ కథలే ఆమె మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయి. ఐదవ తరగతిలోనే కరాటే నేర్చుకున్న జాహ్నవి నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ ను కూడా సాధించింది. అంతేకాదండోయ్.. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి రంగాల్లో కూడా శిక్షణ పొందింది.

Exit mobile version