Sankranthi Releases: సంక్రాంతి రిలీజ్ లపై ప్రెస్ మీట్.. కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Film Producers Council Joint Pressmeet: సంక్రాంతి అంటేనే సినిమాల జోరు, ఈ క్రమంలో ఈ ఏడాది ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియా, వెబ్ సైట్స్, న్యూస్ ఛానల్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్లకు వచ్చే న్యూస్ ద్వారా ఇండివిడ్యువల్ గా డ్యామేజ్ జరుగుతోందని అన్నారు. సంక్రాంతి పండక్కి ఎప్పుడూ సినిమాల పోటీ ఉంటుంది కాని 15 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ మీట్లో మేము తీసుకున్న డెసిషన్ కి ఒప్పుకుని ఈగల్ టీం వెనక్కి తగ్గిందన్నారు. ఛాంబర్ అడగగానే విశ్వ ప్రసాద్, వివేక్, రవితేజ ఒప్పుకొని బరిలో నుంచి తప్పుకోవడంతో మిగతా నాలుగు సినిమాలకు కొంత స్క్రీన్ దొరికి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల మీద తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీట్ కి ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి వారి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు. అలా సంక్రాంతి బరిలో నుంచి వెనక్కి తగ్గిన ఈగల్ మూవీ టీం ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్, వివేక్, రవితేజకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈసారి కూడా పలు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం చాంబర్ తరఫున పలువురు ప్రొడ్యూసర్స్ ని పిలిచి గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ మీటింగ్ లో మేం చెప్పింది ఆలోచించి వెనక్కి తగ్గి తమ సినిమాను వాయిదా వేసుకున్న ఈగల్ మూవీకి కృతజ్ఞతలు. ఇందులో ఎవరికీ వ్యక్తిగత లాభం లేదు ఇది అందరి సినిమాల కోసం ఆలోచించి చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపం రెడ్డి మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి కృతజ్ఞతలు. ఇది మా సినిమా ఇండస్ట్రీ యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తుంది అన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సునీల్ నారంగ్ , అనుపం రెడ్డి , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ , దామోదర్ ప్రసాద్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , నిర్మాతలు నిరంజన్ రెడ్డి వివేక్ కూచిబొట్ల చిత్తూరు శ్రీను మరియు వెంకట్ బోయినపల్లి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!