NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏమన్నదంటే ?

Gamechanger

Gamechanger

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ఇద్దరి కెరీర్ లో చాలా కీలకమైన మూవీగా గేమ్ ఛేంజర్ రాబోతుంది. ప్రేక్షకులు ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచే ఈ సినిమా హిట్ కావాలని మెగా ఫ్యాన్స్ అభిమానులు ఆశిస్తన్నారు. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ వచ్చి ఎట్టకేలకి ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది.

Read Also:Congress MLA: 15 అడుగుల స్టేజ్‌పై నుంచి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తి అయింది. ఈ సినిమా 165 నిమిషాల నిడివితో రాబోతున్నట్లుగా ఖరారు అయింది. అయితే ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ ని చురక అంటించిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకి తెలుగు పదాలతో పేర్లు తక్కువ రావడమే కాకుండా తెలుగు అక్షరాల్లో ఈ ఇంగ్లీష్ టైటిల్ ని కూడా పొందుపరచడం లేదు.

Read Also:Kangana Ranaut : నేడు కోర్టులో హాజరుకానున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఎందుకంటే ?

ఇంకా చెప్పాలంటే పలు చిత్రాలకి కనీసం సినిమా మొదట్లో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారనే చెప్పాలి. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డుని తెలుగులో కూడా పెట్టాలని సెన్సార్ బోర్టు సూచించింది. దీనితో తెలుగు వెర్షన్ రిలీజ్ లో కూడా థియేట్రికల్ గా ఇంగ్లీష్ టైటిల్ తోనే ప్లాన్ చేసిన టీం నిర్లక్ష్యానికి తెలుగు సెన్సార్ బోర్డు కాస్త చురకలంటించిందనే చెప్పాలి.

Show comments