NTV Telugu Site icon

Telegram Update: ఇకపై టెలిగ్రామ్‌లో స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్.. కొత్త అప్డేట్స్ ఇవే!

Telegram

Telegram

Telegram Update: టెలిగ్రామ్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్‌ యాప్‌లలో ఒకటి. కోట్ల సంఖ్యలో యూజర్లు దీనిని ఉపయోగిస్తున్నారు. మెసేజింగ్‌ సౌకర్యం మాత్రమే కాకుండా, టెలిగ్రామ్ తన వినియోగదారులకు అధునాతన ఫీచర్లను అందిస్తూ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. ఇది యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా.. భద్రతను పెంచేలా ఉండబోతుంది.

Read Also: Viral Video: ఎవర్రా మీరంతా! పాముతో స్కిప్పింగ్ చేయడమేంటయ్య?

ఇక టెలిగ్రామ్‌ తాజా అప్‌డేట్‌ విషయానికి వస్తే.. ఇందులో ముఖ్యమైన ఫీచర్ ‘కాంటాక్ట్ కన్ఫర్మేషన్’ (Contact Confirmation). టెలిగ్రామ్‌ లోని యూజర్లకు ఎవరైనా కొత్త నంబర్ నుంచి మెసేజ్ పంపినప్పుడు, ఆ నంబర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా.. ఆ నంబర్ టెలిగ్రామ్‌ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయ్యిందో తెలుసుకోవచ్చు.

ఇంకా.. ఆ నంబర్ ఏ దేశానికి చెందినదో, అలాగే మీరు మీకు మెసేజ్ పంపిన వ్యక్తి ఏదైనా ఒకే గ్రూప్‌లో ఉన్నారా? అనే సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆ అకౌంట్ వెరిఫైడ్ అయినదా, లేక రెగ్యులర్ ఖాతా అనేదీ కూడా తెలుసుకోవచ్చు. దీనివల్ల స్పామ్‌ మెసేజెస్, అనవసరమైన నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు యూజర్ల ఇబ్బందిని తగ్గించనుంది.

దీనితో పాటు, ప్రీమియం యూజర్లకు అదనపు ఫీచర్‌లను కూడా తెచ్చింది. ముఖ్యంగా, కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఫిల్టర్ చేసే వ్యవస్థను తీసుకువచ్చింది. దీని వల్ల స్పామ్ మెసేజ్‌లు, స్పామ్ కాల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల నుంచే మెసేజ్‌లు స్వీకరించగలరు. ఇంకా ప్రొఫైల్ కవర్‌ను గిఫ్ట్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చింది.

Read Also: Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత సంచలన పోస్ట్..

మరిన్ని ముఖ్యమైన అప్‌డేట్స్ విషయానికి వస్తే.. ఎమోజీ రియాక్షన్స్, అడ్వాన్స్డ్ సెర్చ్ ఫిల్టర్, కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు, క్యూఆర్ కోడ్ స్కానర్, సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్ ఫీచర్లను తీసుకొచ్చింది. టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూ వారి అనుభవాన్ని మెరుగుపరచడం గమనార్హం. తాజా అప్‌డేట్ ద్వారా మెసేజింగ్‌ను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో టెలిగ్రామ్ మరింత ఆకర్షణీయమైన యాప్‌గా మారే అవకాశముంది.