NTV Telugu Site icon

Telegram CEO: షరతులపై బెయిల్ పొందిన టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్..

Pavel Durov

Pavel Durov

Telegram CEO pavel durov Get Bail: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్‌ ను గత వారం శనివారం ఫ్రాన్స్‌ లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28), మెసేజింగ్ యాప్‌లో వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో టెలిగ్రామ్ యజమానిపై ఫ్రెంచ్ కోర్టు అనేక తీవ్రమైన ఆరోపణలను రూపొందించింది. అయితే, కొన్ని షరతులతో దురోవ్‌ కు బెయిల్ మంజూరు చేయవచ్చని కూడా విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది.

Passport Portal: 5 రోజుల పాటు ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ పోర్టల్ బంద్..

ఇకపోతే, అధికారులు కోరిన పత్రాలను పంచుకోవడానికి నిరాకరించినందుకు డ్యూరోవ్‌పై ఫ్రెంచ్ కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. ముఖ్యంగా పిల్లల అశ్లీలత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, మైనర్‌ల చిత్రాలను ప్రసారం చేయడానికి అనుమతించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను అమలు చేయడంలో అనుమానం ఉన్న నేపథ్యంలో ఈ చర్యను చేప్పట్టారు. అనుమానితులపై చట్టపరమైన వైర్‌ ట్యాప్‌ లను నిర్వహించడానికి ఏజెన్సీలకు సహాయం చేయడానికి నిరాకరించినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..

టెలిగ్రామ్ సీఈవో బెయిల్ కోసం 50 లక్షల యూరోలు (దాదాపు రూ. 47 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాన్స్ కోర్టు పేర్కొంది. దీనితో పాటు, అతను వారానికి రెండుసార్లు పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలి. విచారణ సమయంలో అతను ఫ్రాన్స్‌ను విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్లలేడు. ప్లాట్‌ఫారమ్లో చట్టవిరుద్ధమైన కంటెంట్, కార్యకలాపాలను అనియంత్రితంగా నడుపుతున్నందుకు ఫ్రెంచ్ అధికారులు అతన్ని అరెస్టు చేసారు. దురోవ్ రష్యా కాకుండా అనేక దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నందున అతని అరెస్టు అంతర్జాతీయ సమస్యగా మారింది. అతను సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. టెలిగ్రామ్ CEOపై ఫ్రాన్స్ చర్యపై రష్యా సందేహాలను లేవనెత్తుతుండగా, దురోవ్‌కు అన్ని చట్టపరమైన ఎంపికలను అందించాలని UAE ఫ్రాన్స్‌ను కోరింది.

Show comments