Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్ ప్రకటించిన టెలిగ్రామ్.. 42 లక్షలకు పైగా బహుమతులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram Global Contest: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్ వీడియోలు రూపొందించాలి.
Read Also: Chennai: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
టెలిగ్రామ్ సీఈఓ, సహ-సంస్థాపకుడు పావెల్ డ్యూరోవ్, తన అధికారిక చానెల్‌లో పోటీ ప్రకటన చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ టెలిగ్రామ్‌పై “తప్పుడుప్రచారం” నిర్వహించిందని ఆరోపించిన డ్యూరోవ్, “ఇకపై మంచి పద్దతిలో ఆడటం లేదు, గ్లవ్స్ తీయండి” అంటూ కాస్త గట్టిగానే ప్రతిస్పందించారు. అలాగే, వాట్సాప్ తరచుగా టెలిగ్రామ్ పరిచయం చేసిన ఫీచర్లను “తక్కువ నాణ్యతతో” అనుకరిస్తోందని విమర్శించారు.
ఇకపోతే, టెలిగ్రామ్ మెసేజింగ్ టెక్నాలజీని మలుపు తిప్పిన ఫీచర్లను ఈ పోటీ ప్రధానంగా హైలైట్ చేయాలనుకుంటోంది. వీటిలో ఫైల్ షేరింగ్, చానెల్ బ్రాడ్‌కాస్టింగ్, కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్‌లు, బాట్ ఇంటిగ్రేషన్ లను టెలిగ్రామ్ ముందుగా ప్రవేశపెట్టినవని కంపెనీ తెలిపింది. వాట్సాప్ వంటి ఇతర యాప్‌లు తరువాత వాటిని స్వీకరించాయని ఆరోపించారు.
Read Also: Storms Hit US: తుఫాన్ దెబ్బకు అమెరికా విలవిల.. 25 మంది మృతి..!
ఇక పోటీ గురించిన వివరాలు చూస్తే.. ఇందులో బహుమతి మొత్తంగా 50,000 డాలర్స్ వరకు ఇవ్వనుండగా.. మే 26, 2025 (గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 11:59 వరకు) గడువును ఇచ్చారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చు. జూన్ 2025లో ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఇందులో ఒక్కో వీడియో గరిష్ట వ్యవధిని 180 సెకన్లుగా ఉంచారు. ఈ వీడియోను ఇంగ్లీష్ లో రూపొందించాలి. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కి అనుకూలంగా ఉండాలి. వీటిలో AI టూల్స్ సహాయంగా కూడా వాడుకోవచ్చు
స్పష్టత, విజువల్ ఆకర్షణ, మీమ్ అర్హత, వైరల్ కావడానికీ అనువుగా ఉండడం లాంటి అంశాల ఆధారంగా జడ్జ్ చేయబడతాయి. ఈ పోటీలో వ్యక్తిగతంగా గానీ, బృందాలుగా గానీ పాల్గొనవచ్చు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, టెలిగ్రామ్ గ్లోబల్ యూజర్ బేస్‌లో గుర్తింపు లభించనుంది.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!