NTV Telugu Site icon

Mobile ReCharge: మొబైల్ యూజర్లకు బ్యాడ్న్యూస్.. పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్స్..

Telecom

Telecom

టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై మరోసారి భారం మోపడానికి రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, గత రెండేళ్లుగా ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థలు ఈసారి ఎలాగైనా వాటిని పెంచాలని చూస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను కనీసం 15 నుంచి 20 శాతం వరకు పెంచే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్‌ నుంచి వచ్చే సరాసరి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా మరోసారి తమపై భారం మోపేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయని తెలిపింది.

Read Also: Off The Record: బీఆర్ఎస్‌ పనికిరాడన్న నేతకి కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ ఎందుకిచ్చింది..?

అయితే, కొంత కాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్‌ల పెంపునకు సరైన సమయం కోసం టెలికం సంస్థలు వేచి చూస్తున్నాయి. ఈమేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్‌ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అవి పూర్తి అయిన తర్వాత కంపెనీలు ఛార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎంట్రీ లెవల్‌ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు వివిధ ధరల్లో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించాలని చూస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికం సంస్థలు ఇష్టం వచ్చినట్లు టారిఫ్‌ ప్లాన్ల ధరల్లో మార్పులు చేసుకుంటు వస్తుంది.

Read Also: Drug Network: మరో భారీ డ్రగ్ నెట్వర్క్.. ఛేదించిన పంజాగుట్ట పోలీసులు..!

ఇక, తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారి టారిఫ్‌ చెల్లింపులు భరించలేకపోతున్నారనే వాదనలు సైతం వస్తున్నాయి. టెలికం సంస్థలు వీరి కోసం స్పెషల్ ప్లాన్లను తీసుకు రావాలని కోరుతున్నారు. ఇక, 2021లో టారిఫ్‌లను పెంచిన టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. దాంతో కంపెనీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఆ వ్యయంలో కొంత మేర వినియోగదారుల నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అవి తొందరలోనే ఫలించబోతున్నట్లు కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.