సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి మూడవ ప్లీనరి సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. తమ ఆర్థిక రాజకీయ స్వలాభాల కోసమే తెలంగాణ రాష్ట్రంలో సీఎం విధ్వంసం సృష్టిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండానే సొంత ఎజెండాను అమలుపరుస్తున్నది అని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ పదాన్ని వదిలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరచి బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలలో వెళ్లడం సరికాదు అంటూ వ్యాఖ్యనించాడు.
Also Read: West Bengal: రైలు ప్రమాదంలో గాయపడిన వాళ్లను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం..
దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న రైతుగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం సిగ్గుచేటు అని టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం అన్నారు. పోడు రైతులకు పట్టాలు లేవు.. విద్య-వైద్యం ఉచితంగా అందట్లేదు.. తెలంగాణ పరిరక్షణకు ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.
Also Read: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ సర్కారు ఎక్స్‌గ్రేషియా..
తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం ఒక టీజేఎస్ తోనే సాధ్యం అని కోదండరాం అన్నారు. తెలంగాణ శక్తులు ఉద్యమకారులు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. రైతులు రుణమాఫీ లేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అస్తిత్వాన్ని కాపాడుకుంటామని కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీజేఎస్ పని చేస్తుందని తెలిపారు.