Site icon NTV Telugu

Rains : రాబోయే 24 గంటలు అత్యంత భారీ వర్షాలు..

Telangana Rains

Telangana Rains

Rains : తెలంగాణలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మాల్, నిజమాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Read Also : Bandi Sanjay : సంజయ్ చొరవ.. రంగంలోకి వైమానిక దళ హెలికాప్టర్

తెలంగాణలోని 10 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాబట్టి రాబోయే 24 గంటలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైళ్లు, బస్సులు ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రాకపోకలు ఆపేశారు. ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు అందజేస్తున్నాయి.

Read Also : Medak- Kamareddy : మెదక్, కామారెడ్డిలో స్కూల్స్ కు రేపు సెలవు

Exit mobile version