NTV Telugu Site icon

Ponnam Prabhakar : తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం…

Ponnam Prabhakar

Ponnam Prabhakar

తమిళనాడు రాష్ట్రం లో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం చేసింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ IAS ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎం వి ఐ జింగ్లి శ్రీనివాస్ లు ఈ రోజు తమిళ నాడు రాష్ట్రం లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసేందుకు వెళ్లారు…

రెండు రోజుల పర్యటన లోభాగం గా ఈ రోజు తమిళ నాడు రవాణా శాఖ కమిషనర్ శ్రీ షణ్ముగ సుందరం IAS తో భేటి అయ్యారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన్ పోర్టల్, స్క్రాపింగ్ పాలసి, పన్నుల విధానం, ఆదాయ వివరాలు, చెక్ పోస్టు ల పని తీరు, ఆన్ లైన్ సర్వీసులు తదితర అంశాలు తమిళనాడు లో అమలవుతున్న తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో 4 బృందాలు పర్యటించి ఆయా రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యం లొని అధికారుల బృందం జూలై 1 , 2 తేదిలలో పర్యటిస్తుంది. వీరి అధ్యయనానికి తోడ్పాటు గా తమిళనాడు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేష్ , ఆర్ టి వో సంపత్ కుమార్ , ఎం వి ఐ కార్తీక్ లను తమిళనాడు రవాణా శాఖ నియమించింది త్వరలో కమిషనర్ కు నివేదిక సమర్పిస్తామని చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు..