Telangana: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
Read Also: CM Revanth Reddy : వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలి
తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. నేటితో గడువు ముగియనున్న తరుణంలో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బైకులు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, లారీ వంటి భారీ వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది.
