తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై జనవరిలో షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఫిబ్రవరిలో దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతూనే వున్నాయి. అయితే తాజాగా బుధవారం బదిలీలపై విధించిన స్టే ను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను స్పీడప్ చేసేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతుంది.. అయితే, జనవరిలోనే షెడ్యూల్ ప్రకటించి టీచర్ల నుంచి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత బదిలీలు నిర్వహిస్తుండటంతో 59,909 మంది టీచర్స్ అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి దాదాపు 3,649 దరఖాస్తులు వచ్చాయి.. అయితే నిబంధనల ప్రకారం టీచర్లు ఒకేచోట 8 సంవత్సరాలు అలాగే హెడ్మాస్టర్లు ఒకే చోట ఐదు సంవత్సరాలు పనిచేసిన వారంతా కూడా బదిలీలకు అప్ల య్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి ఒకటో తేదీని కటాఫ్ డేట్‌గా ప్రకటించారు.స్టే విధించడంతో ప్రక్రియ ఆగిపోయింది.తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో దీంతో కొత్తగా సెప్టెంబర్ 1 కటాఫ్ డేట్‌గా నిర్ణయించి, అప్లికేషన్లు తీసుకోవాలని చూస్తున్నారు… దీంతో ఐదారు వేల మంది టీచర్లు అదనంగా దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. దీనికి తోడు మూడేండ్ల సర్వీస్ ఉన్నవాళ్లకు మినహాయింపులు కూడా ఉంటాయి.. కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడంతో పాటు పాత దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం..సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బదిలీలు మరియు ప్రమోషన్లకు సంబంధించి మరోసారి షెడ్యూల్ ఇచ్చే చాన్స్ ఉంది. ముందుగా కొత్తగా అర్హ త పొందిన టీచర్లకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు.. ఆ తర్వాత హెడ్మాస్టర్లకు బదిలీలు నిర్వహించి, ట్రాన్స్‌ఫర్లు చేపడతారు.. అలాగే స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లగా ప్రమోషన్లు ఇచ్చి, ఎస్‌ఏలకు ట్రాన్స్‌ఫర్లు చేస్తారు. అదేవిధంగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చి, మిగిలిన వారికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే ఖాళీగా వున్న టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా నియామకం చేపడతారు.
