NTV Telugu Site icon

Telangana TET : టెట్ అప్లికేషన్స్ కు ముగిసిన గడువు..

Whatsapp Image 2023 08 17 At 8.58.57 Am

Whatsapp Image 2023 08 17 At 8.58.57 Am

తెలంగాణ రాష్ట్రం లో ఆగష్టు నెల 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆగష్టు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. రాష్ట్రం లో సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 పరీక్షను రాసుకునేందుకు అవకాశం కల్పించారు.గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉండేది.కానీ 2018 న బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు పేపర్-2తో పాటు పేపర్-1కు కూడా రాసుకునే అవకాశం ఎన్సిటీఈ కల్పించింది.అయితే రాష్ట్రంలో 1.5 లక్షల మంది డిఈడి పూర్తి చేసినవారు అలాగే 4.5 లక్షల మంది బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు.గతంలో, టెట్ చెల్లుబాటు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది.కానీ రెండేళ్ల క్రితం, టెట్ కాలవ్యవధిని జీవితకాలానికి పొడిగించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్‌కు అర్హత సాధించని వారు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా బీఈడీ, డీడీ పూర్తి చేసిన వారు మరో 20 వేల మంది వరకు ఉంటారు. వీరందరికీ తాజా టెట్‌తో మరోసారి పోటీ చేసే అవకాశం దక్కనుంది.అయితే తాజాగా విడుదల చేసిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులకు గడువు బుధవారం అర్థరాత్రి తో ముగిసింది. రాత్రి 9 గంటలకు వరకూ 2,83,620 మంది అప్లై చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.ఇందులో పేపర్ 1కు 80,990, పేపర్ 2కు 20,370 మంది అప్లై చేశారని వారు పేర్కొన్నారు. రెండు పరీక్షలకు1,82,260 మంది దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అయితే మొత్తం 2,90,941 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. కాగా, దరఖాస్తులకు బుధవారం సాయంత్రం 5 వరకే గడువు అని ప్రకటించినా కూడా ఆ తర్వాత 12 గంటల వరకూ సమయం పొడిగించారు. హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, గద్వాల, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ వంటి జిల్లాలలో సాయంత్రం 6 గంటల వరకే  టెట్ సెంటర్లను అధికారులు బ్లాక్ చేశారు