NTV Telugu Site icon

Film Chamber Committee: రేవతి కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

Sritej

Sritej

Film Chamber Committee: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. రేవతి కుటుంబానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

పుష్ప-2 ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్ షో సమయంలో, అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య 70ఎంఎంకు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను పరామర్శించారు.

Read Also:Karti Chidambaram: వారానికి 4 రోజుల పని అవసరం.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఫైర్!

శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిమ్స్ వైద్యులు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని వివరించారు. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అతనికి ట్యాబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఛాంబర్ సభ్యుల నుంచి విరాళాలను కోరింది. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేసింది.

ఈ నోట్ లో ఇలా రాసుకొచ్చింది.. ‘‘2024 డిసెంబర్ 4 రాత్రి “పుష్ప 2” సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగినది.. ఇది చాలా దురదృష్టకరం. అది విచారకరమైన సంఘటన. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులమైన మేము ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతున్న ఆ చిన్నారికి అండగా నిలుస్తాం. దానికి ప్రతిఫలంగా మా ఛాంబర్ ద్వారా ఆ చిన్నారి కుటుంబానికి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రయోజనం కోసం విరాళం ఇవ్వాలనుకునే సభ్యులందరూ ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని ఛాంబర్ ఖాతాకు పంపవచ్చని మేము అభ్యర్థిస్తున్నాము.’’ అంటూ రాసుకొచ్చింది. ఈ మేరకు అకౌంట్ నంబర్, యూపీఐ ఐడీని అందించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
Chamber Account details: A/C. No. 052911100000973
Union Bank of India Sebastian Road Branch. IFSC: UBIN0805297
UPI Code: telan96408@barodampay

Read Also:Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!

Show comments