Film Chamber Committee: రేవతి కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
- రేవతి కుటుంబాన్ని ఆదుకోనున్న ఫిల్మ్ ఛాంబర్
- ఇంకా విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం
- విరాళాలను సేకరించనున్న ఛాంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Film Chamber Committee: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. రేవతి కుటుంబానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
పుష్ప-2 ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్ షో సమయంలో, అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య 70ఎంఎంకు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను పరామర్శించారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Read Also:Karti Chidambaram: వారానికి 4 రోజుల పని అవసరం.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఫైర్!
శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిమ్స్ వైద్యులు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని వివరించారు. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అతనికి ట్యాబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఛాంబర్ సభ్యుల నుంచి విరాళాలను కోరింది. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేసింది.
ఈ నోట్ లో ఇలా రాసుకొచ్చింది.. ‘‘2024 డిసెంబర్ 4 రాత్రి “పుష్ప 2” సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగినది.. ఇది చాలా దురదృష్టకరం. అది విచారకరమైన సంఘటన. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులమైన మేము ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతున్న ఆ చిన్నారికి అండగా నిలుస్తాం. దానికి ప్రతిఫలంగా మా ఛాంబర్ ద్వారా ఆ చిన్నారి కుటుంబానికి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రయోజనం కోసం విరాళం ఇవ్వాలనుకునే సభ్యులందరూ ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని ఛాంబర్ ఖాతాకు పంపవచ్చని మేము అభ్యర్థిస్తున్నాము.’’ అంటూ రాసుకొచ్చింది. ఈ మేరకు అకౌంట్ నంబర్, యూపీఐ ఐడీని అందించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
Chamber Account details: A/C. No. 052911100000973
Union Bank of India Sebastian Road Branch. IFSC: UBIN0805297
UPI Code: telan96408@barodampay
Read Also:Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!