NTV Telugu Site icon

Mobile Recovery : మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ

Police Phone Recovery

Police Phone Recovery

తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సిఐడి అదనపు డిజిపి శిఖా గోయెల్, , సీఈఐఆర్ పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో గల 780 పోలీస్ స్టేషన్‌లు ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాలను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. గత 8 రోజుల్లోనే 1000 పరికరాలను రికవరీ చేసి, వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించారు. ప్రతిరోజు సగటున 82 మొబైల్‌లను రికవరీ చేస్తున్నారు.

ప్రధాన మైలురాళ్ళు

* 10,000 మొబైల్‌లు: 189 రోజుల్లో
* 20,000 మొబైల్‌లు: 291 రోజుల్లో
* 30,000 మొబైల్‌లు: 395 రోజుల్లో
* 37,000 మొబైల్‌లు: 459 రోజుల్లో

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో (3808) తరువాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో (2174) , సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో (2030) మొబైల్ పరికరాలను రికవరీ చేశారు.

తెలంగాణ పౌరులకు మరింత సులభంగా , మెరుగుగా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు టెలికాం శాఖ (డి వో టి) తో కలిసి సీఈఐ ఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించారు. పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాల గురించి రిపోర్ట్ చేయడానికి ప్రజలు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చు.

ప్రారంభమైనప్పటి నుండి, సి ఇ ఐఆర్ పోర్టల్ తెలంగాణ పోలీసులచే స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా ఉద్భవించింది. మొబైల్ పరికరాలను కోల్పోయిన వ్యక్తులకు ఇది ఒక ఆశాదీపంగా మారింది. అనేక మంది వినియోగదారుల నుండి వచ్చిన టెస్టిమోనియల్‌లు పోర్టల్ యొక్క ప్రభావాన్ని , పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందడంలో ఇది చూపిన సానుకూల ప్రభావాన్ని ధృవీకరిస్తాయి.

డాక్టర్ లావణ్య , ఎస్పీ, సిఐడి, డి ఓ టి అధికారులతో సమన్వయంతో, హేమంత్ రాథ్వే, డిడిజి సెక్యూరిటీ, ఏం. అరవింద్ కుమార్, డైరెక్టర్ సెక్యూరిటీ, లక్ష్మణ కుమార్ కె, అసిస్టెంట్ డైరెక్టర్ (సెక్యూరిటీ ఆడిట్), , సి హెచ్ సురేష్ బాబు,ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్, సీఐడీ రాష్ట్రంలో సీఈఐఆర్ ను ఉపయోగించడంలో సిఐడి అదనపు డిజిపి కు సహకరిస్తున్నారు.