Site icon NTV Telugu

Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..

Telangana Secretariat

Telangana Secretariat

Telangana Secretariat : సెక్రటేరియట్‌ వద్ద ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు దిగాడు సదర్‌ వ్యక్తి. అయితే.. మూడు రోజుల నుంచి లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అధికారులకు ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు దిగాడు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించారు ఎస్పీఎఫ్ పోలీసులు. అయితే.. పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో ఫోన్ చేసిన వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….

Exit mobile version